యాకుత్‌పురా - Yakutpura

శంకేశ్వర్ బజార్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన

శంకేశ్వర్ బజార్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన

హైదరాబాద్‌లోని యాకుత్‌పురా, ఐఎస్.సదన్ డివిజన్‌లోని శంకేశ్వర్ బజార్ కాలనీలో రూ.7.34 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, పనులను నాణ్యతతో, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జంగం మధుకర్ రెడ్డి, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు అమర్నాథ్ రెడ్డి, కాలనీ కమిటీ సభ్యులు మోసెస్ నల్లిమెల్లి, గోపినాధ్, నాగేందర్ రెడ్డి, వీరభదరావు, రవి, గోపాల్ చారీ, రంగరాజు రవి తదితరులు పాల్గొన్నారు.

వీడియోలు


హైదరాబాద్