TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాకిచ్చింది. HYD యూసుఫ్‌గూడ పరిధిలోని సర్వే నంబర్ 45లో ఉన్న భూమిపై స్టేటస్ కో ఉన్నప్పటికీ, కాంపౌండ్ వాల్ కూలగొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బోర్డు ఏర్పాటు చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇచ్చినా పట్టించుకోకుండా, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా కడితేనే కౌంటర్ అఫిడవిట్ అంగీకరించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని హైకోర్టు సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.