ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


బీసీల హక్కుల పరిరక్షణకు బలమైన చట్టం: మంత్రి సవిత
Aug 05, 2026, 07:08 IST/

బీసీల హక్కుల పరిరక్షణకు బలమైన చట్టం: మంత్రి సవిత

Aug 05, 2026, 07:08 IST
AP: రాష్ట్రంలో బీసీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం మరింత బలమైన చట్టం తీసుకువచ్చే లక్ష్యంతో విజయవాడలో బీసీ ప్రజాప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని బీసీ చట్ట ముసాయిదాపై విలువైన సూచనలు చేశారు. బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. ఈ చట్టం దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, బీసీల సాధికారతను బలోపేతం చేసేలా తుది రూపు ఇస్తామని వెల్లడించారు.