హైడ్రాకు కాంగ్రెస్ నాయకుల భూ కబ్జాలు కనిపించడం లేదా: హరీశ్ రావు

15చూసినవారు
హైడ్రాకు కాంగ్రెస్ నాయకుల భూ కబ్జాలు కనిపించడం లేదా: హరీశ్ రావు
TG: హైడ్రా తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్‌లు, భూ కబ్జాలు హైడ్రాకు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజేంద్ర నగర్ - మానస హిల్స్‌లో అనుమతులు లేకుండా కొండలు తవ్వుతున్నారని అన్నారు. మంత్రులు, వాళ్ళ బంధువులు చేస్తున్న మైనింగ్, భూ కబ్జాలు హైడ్రాకు కనిపించడం లేద అని అన్నారు. మానస హిల్స్‌లో జరిగే అక్రమ మైనింగ్‌ను వెంటనే నిలిపివేసి జరిమానాతో రికవరీ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్