మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హైడ్రా.. ప్రతి శనివారం 'ఫోన్ ఇన్'

35చూసినవారు
మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హైడ్రా.. ప్రతి శనివారం 'ఫోన్ ఇన్'
TG: హైడ్రా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఇకపై ప్రతి శనివారం హైడ్రా కమిషనర్‌తో ఫోన్ ఇన్ నిర్వహించాలని నిర్ణయించింది. సెలవు రోజులు మినహా ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉండనుంది. ఆక్రమణలు, చెరువుల్లో మట్టి తవ్వకాలు వంటి అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో ఉన్న న‌గ‌ర ప్ర‌జ‌లు 040-29565750, 040-29565759 ఈ రెండు ఫోను నంబ‌ర్ల‌కు ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్