TG: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ గుట్టురట్టయింది. డ్రగ్ కేసులో తెలంగాణ ఈగల్ పోలీసులు కీలక ఆపరేషన్ చేపట్టారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి రూ.12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిని థాయిలాండ్ నుంచి హైదరాబాద్‌కు రవాణా చేసినట్లు గుర్తించారు. కీలక నిందితుడు సహా 10 మంది పెడ్లర్లను అరెస్టు చేశారు.