వాతావరణం చల్లబడినప్పుడు వచ్చే జలుబు, తలనొప్పి సమస్యలకు ఆయుర్వేద నిపుణులు 'హైడ్రో థెరపీ'ని అద్భుతమైన పరిష్కారంగా సూచిస్తున్నారు. ముఖ్యంగా, పాదాలను వేడి నీటిలో నానబెట్టడం (ఫుట్ సోక్స్) ద్వారా తలనొప్పి, మైగ్రేన్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. వేడి నీటిలో పాదాలను ముంచినప్పుడు రక్తనాళాలు విస్తరించి, తలలో రక్తపోటు, వ్యాస్కులర్ రద్దీ తగ్గి టెన్షన్, చలి, సైనస్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది.