భారత్‌లో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు: హ్యుందాయ్‌

11246చూసినవారు
భారత్‌లో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు: హ్యుందాయ్‌
దక్షిణకొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ భారత్‌లో 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.45వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ జోస్‌ మునోజ్‌ బుధవారం వెల్లడించారు. భారత ఆటోమొబైల్‌ ఎగుమతుల్లో తమ వాటాను 30 శాతానికి పెంచాలని, వచ్చే ఐదేళ్లలో ఆదాయాన్ని 1.5 రెట్లు పెంచి రూ.లక్ష కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2029-30 నాటికి 26 కొత్త ఉత్పత్తులను, 2027 నాటికి లగ్జరీ బ్రాండ్‌ జెనెసిస్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మునోజ్‌ వివరించారు.

సంబంధిత పోస్ట్