RSS భావజాలానికి తాను వ్యతిరేకమని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు తాను ఏ పార్టీ సిద్ధాంతానికి అనుకూలం, వ్యతిరేకం కాదని తెలిపారు. అయితే, RSS భావజాలాన్ని మాత్రం తాను అంగీకరించబోనని పేర్కొన్నారు. ఎందుకంటే, తాను ప్రజాస్వామ్యవాదిని అని.. లౌకిక వాదం, సామాజిక న్యాయం, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ ఐడియాలజీని విశ్వసిస్తానని స్పష్టం చేశారు.