
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్
TG: పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. జనసేన పార్టీ తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగుతుందని, రాష్ట్రంలోని సమస్యలపై గళమెత్తుతామని, ప్రజల్లో తిరుగుతామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలను తమ పార్టీ వేదికగా ప్రస్తావించి, పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.




