నా దగ్గర రూ.1000 కోట్ల సినిమాలు లేకపోయినా హ్యాపీగా ఉన్నా: సమంత

17624చూసినవారు
నా దగ్గర రూ.1000 కోట్ల సినిమాలు లేకపోయినా హ్యాపీగా ఉన్నా: సమంత
అగ్ర కథానాయిక సమంత రూత్‌ ప్రభు మయోసైటిస్‌ తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని ఓ ఇంటర్వూలో తెలిపారు. గతంలో విజయాన్ని వరుస సినిమాలు, బాక్సాఫీసు నంబర్లతో కొలిచేదాన్నని, కానీ ఇప్పుడు ఆ ఆలోచనల నుంచి బయటపడ్డానని చెప్పారు. ‘‘రెండేళ్లుగా నా సినిమాలు విడుదల కాలేదు, టాప్‌ 10లోనూ లేను, రూ.1000 కోట్ల సినిమాలు చేయలేదు. అయినా నేను సంతోషంగానే ఉన్నాను’’ అని అన్నారు. అభిమానుల కోసం ఆరోగ్య పాడ్‌కాస్ట్‌లు నిర్వహిస్తున్నానని తెలిపారు.