నేను వైద్యుడిని కాదు.. కానీ, సోషల్ డాక్టర్‌ను: సీఎం రేవంత్‌

35చూసినవారు
నేను వైద్యుడిని కాదు.. కానీ, సోషల్ డాక్టర్‌ను: సీఎం రేవంత్‌
TG: ప్రజారోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని CM రేవంత్‌రెడ్డి తెలిపారు. HYDలో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'నేను వైద్యుడిని కాకపోయినప్పటికీ.. సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే డాక్టర్‌ను. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్యులు కలిసి పనిచేద్దాం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం అందరూ కృషి చేయాలి. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తెలంగాణ ఉండాలి' ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్