కేసులకు, అరెస్ట్‌లకు భయపడను: ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు

0చూసినవారు
తనపై నమోదైన కేసులపై రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వ‌ర్‌రావు స్పందించారు. 30 ఏళ్ల వయస్సులోనే తాను దేనికీ భయపడలేదని, ఇప్పుడు 62 ఏళ్ల వయస్సులో అరెస్ట్‌లకు అస్సలు భయపడబోనని స్పష్టం చేశారు. తనపై కులం, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నానని, అల్లర్లు రేపుతున్నానని తప్పుడు కేసులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. వాళ్లే కులాలు, ప్రాంతాల గురించి మాట్లాడారు తప్ప.. తననుంచి అలాంటి మాటలు రాలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్