నేను ఎవరి బాణాన్ని కాను.. బహుజనుల బాణాన్ని: కవిత (VIDEO)

8చూసినవారు
TG: రాష్ట్రంలో రాజకీయాలు కేవలం బూతులు తిట్టుకోవడానికే పరిమితమయ్యాయా అని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నారాయణపేట జిల్లా కొండగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గిలో  నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కవిత మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ విడిచిన బాణమని, బీఆర్ఎస్ విడిచిన బాణమని ప్రచారం చేస్తూ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయితే తాను ఎవరి బాణాన్ని కాదని, 'తెలంగాణ బహుజనుల బాణాన్ని' అని కవిత స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్