కొండా సురేఖపై వేటు అంశం నాకు తెలియదు: మంత్రి ఉత్తమ్‌

4చూసినవారు
కొండా సురేఖపై వేటు అంశం నాకు తెలియదు: మంత్రి ఉత్తమ్‌
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బుధవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుమారు అరగంట పాటు వారు చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్​ మాట్లాడుతూ.. ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసినట్లు వివరించారు. రాజకీయాలేవీ చర్చించలేదని తెలిపారు. కొండా సురేఖపై వేటు అంశం తనకేం తెలియదన్నారు. ఏమైనా ఉంటే పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్