TG: తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
కేసీఆర్,
కేటీఆర్, హరీష్ రావులకు లేఖలు పంపుతున్నానని, తన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు. అప్పులపై
కేసీఆర్, హరీష్ వేర్వేరు లెక్కలు చెప్పాలని.. తప్పు తనదని తేలితే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని వెల్లడించారు. శుక్రవారం కూడా చర్చకు తాను సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి మరోసారి సవాల్ విసిరారు. ఆరోపణలను నిరూపించకపోతే బీఆర్ఎస్‌ను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.