హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐ-బొమ్మ రవిని మరోసారి 7 రోజుల కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు విచారణకు రవి సహకరించడం లేదని, కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడుతామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రేపు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది.