నాన్న కోరిక మేర‌కు నా సొంత గ‌డ్డ‌పై ఇల్లు క‌ట్టుకున్న‌: విజయ్ దేవరకొండ

1చూసినవారు
TG: నటుడు విజయ్ దేవరకొండ తన సొంత ఊరు నాగర్ కర్నూలు జిల్లాలోని తుమ్మన్ పేట గ్రామానికి కుటుంబంతో కలిసి వెళ్లి, సత్యనారాయణ వ్రతం జరిపించి, స్థానికులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నాకు జన్మనిచ్చిన ఈ ఊరితో విడదీయరాని ప్రేమానుబంధాలు ఉన్నాయి. మా నాన్న కోరిక మేరకు ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాను. సొంత గ్రామంలో నా పెళ్లి వేడుకలు మీ మధ్య ఇలా జరుపుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది." అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్