
రేపు మద్యం, మాంసం తీసుకుంటున్నారా?
గాంధీ జయంతి, దసరా ఒకే రోజు (గురువారం) రావడంతో మాంసం, మద్యం ప్రియులను నిరాశకు గురి చేస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా మాంసం, మద్యం షాపులు బంద్ కానున్నాయి. మాంసం, లిక్కర్ షాప్స్ మూసివేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అయితే తెలంగాణలో దసరా అంటే ముక్క, చుక్క తప్పనిసరి. దీంతో ఇవాళే చికెన్, మటన్, లిక్కర్ తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రామాల్లో సామూహికంగా గొర్రెలు, మేకలు కట్ చేసి పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు.




