
టూత్ బ్రష్ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు (వీడియో)
మీ నవ్వు మరింత ఆకర్షణీయంగా కావాలంటే, ముందుగా దంతాలను సరిగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. రోజూ బ్రష్ చేస్తున్నా చాలామంది దంతాలను సరైన పద్ధతిలో తోమటం లేదని దంత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం రోజుకు రెండు సార్లు, ప్రతి సారి రెండు నిమిషాలు బ్రష్ చేయకపోతే నోటిలో ఉండే వందల రకాల బాక్టీరియా పెరిగి దంత క్షయం, దుర్వాసన వంటి సమస్యలు రావడం ఖాయం. టూత్ బ్రష్ల గురించి పూర్తి వివరాలు లోకల్ ఎక్స్ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.




