TG: కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన సందర్భంగా తమను అడుగడుగునా అడ్డుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ ఆరోపించారు. ఉదయం నుంచే పార్టీ నేతలను హౌస్ అరెస్టులు చేశారని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నారని విమర్శించారు. తాను రాజకీయాల కోసం కాకుండా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకే వచ్చానని చెప్పారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి చివరకు పంప్‌హౌస్‌కు చేరుకున్నామని తెలిపారు. దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూసిన తెలంగాణకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో
కేసీఆర్ మహాయజ్ఞం చేపట్టారని
కేటీఆర్ పేర్కొన్నారు.