TG: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్టుపై తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హరీష్‌రావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తనకు తెలియదని స్పష్టం చేశారు. హరీష్‌రావు గన్‌పార్క్ వద్దకు వస్తానని ప్రకటించడంతో, తాను కూడా అక్కడికే వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. తన కార్యక్రమం చర్చ కోసం మాత్రమేనని, అరెస్టు నిర్ణయంతో తనకు సంబంధం లేదని మంత్రి పేర్కొన్నారు. హరీష్‌రావు అరెస్టు అంశంపై పోలీసులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.