నాకు పిల్లలు వద్దు: నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ షాకింగ్‌ నిర్ణయం

7చూసినవారు
నాకు పిల్లలు వద్దు: నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ షాకింగ్‌ నిర్ణయం
నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ తన వ్యక్తిగత జీవితంపై కీలక విషయాన్ని వెల్లడించారు. తనకు, తన భర్త నికోలాయ్‌ సచ్‌దేవ్‌కు పిల్లలు వద్దని స్పష్టం చేశారు. ‘‘నాకు పిల్లలు వద్దు. ఇది చాలా స్పష్టమైన ఎంపిక. నా భర్తకు కూడా ఇదే అభిప్రాయం ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నికోలాయ్‌కు గత వివాహం ద్వారా ఇప్పటికే ఓ కుమార్తె ఉందని, ఆమెను తన కూతురిగానే భావిస్తానని చెప్పారు. తమ రెండు కుక్కలను కూడా పిల్లల్లాగే చూసుకుంటామని పేర్కొన్నారు. పేరెంటింగ్‌ ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, మానసికంగా, భావోద్వేగంగా సిద్ధంగా లేనప్పుడు పిల్లలను కనకపోవడమే బాధ్యతాయుతమైన నిర్ణయమని వరలక్ష్మి అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్