AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పండా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చాను. కానీ పోలీసులు తగిన భద్రత కల్పించలేదు. ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ మంత్రులు, అధికారులు ప్రకటించారు. ముందే సమాచారమివ్వలేదా?’ అని ధర్మకర్త ప్రశ్నించారు.