TG: తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ఫ-2 సినిమా తర్వాత టికెట్ రేట్ల పెంపుకోసం తన వద్దకు రావొద్దని చెప్పినట్లు తెలిపారు. ఇప్పుడు పెరిగిన సినిమా టికెట్ల ధరలకు తనకు సంబంధం లేదని చెప్పారు. కాగా రాజాసాబ్ సినిమాకు టికెట్ల రేటు పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.