వెంకటేష్ హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ విడుదలై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రవికిషోర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. వెంకటేష్ పాత్రను ఎంతో ఓన్ చేసుకుని నటించారని, ఈ తరం ప్రేక్షకులను కూడా అలరిస్తున్న సినిమాకు నిర్మాతగా ఉండటం గౌరవంగా ఉందని రవికిషోర్ తెలిపారు.