TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలపై అడ్లూరి స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. 'ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. ఇక నేను ఏం మాట్లాడను. వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది. వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వివేక్ కొడుకును ఎంపీగా గెలిపించింది ఎవరో ఆయనకు కూడా తెలుసు. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధం’ సవాల్ చేశారు.