న‌న్ను ఎన్‌కౌంట‌ర్‌లో చంపేస్తారేమో: సోన‌మ్ వాంగ్‌చుక్

1741చూసినవారు
న‌న్ను ఎన్‌కౌంట‌ర్‌లో చంపేస్తారేమో: సోన‌మ్ వాంగ్‌చుక్
ల‌డాఖ్‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల‌ని గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 24న లేహ్‌లో జ‌రిగిన ఆందోళ‌న హింస‌కు దారితీసి, న‌లుగురు మ‌ర‌ణించిన నేప‌థ్యంలో ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త సోన‌మ్ వాంగ్‌చుక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ప్ర‌భుత్వం ఎన్‌కౌంట‌ర్ చేయ‌వ‌చ్చ‌ని, అయితే దేశం మేల్కొంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. లేహ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై జ్యుడీషియ‌ల్ విచార‌ణ జ‌రిపించాల‌ని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల‌ని వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. హిందువులు, బౌద్ధుల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించే కుట్ర జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు.

సంబంధిత పోస్ట్