75 ఏళ్లకు రిటైర్ కావాలని నేను ఎవరికీ చెప్పలేదు: RSS చీఫ్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'రాజ్యాంగపరమైన రిజర్వేషన్లకు మా మద్దతు ఉంటుంది. భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే. ఇంగ్లిష్ నేర్చుకోవడంలో తప్పేమిలేదు' అన్నారు. అలాగే 75 ఏళ్లకు రిటైర్ కావాలని తాను ఎవరికీ చెప్పలేదని స్పష్టం చేశారు. కాగా గతంలో మోహన్ భాగవత్ ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా అన్నారనే కామెంట్స్ వినిపించాయి.
