తెలంగాణ రాజ్య సమితి (TRS) పార్టీ పేరుపై పూర్తి హక్కు తనకే ఉందని, కవిత TRS పార్టీని రిజిస్టర్ చేయొద్దని ఎన్నికల సంఘానికి (ఈసీ) తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం లేఖ రాశారు. 2023లోనే తన పార్టీని ఈసీ రిజిస్టర్ చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుతో పది నియోజకవర్గాల్లో పోటీ చేశామని ఆయన పేర్కొన్నారు. కవిత పార్టీ TRS అనే సంక్షిప్త నామంతోనే ప్రచారం చేస్తోందని, దీనివల్ల తన పార్టీకి నష్టం వాటిల్లుతుందని బాలరంగం ఆరోపించారు. కవిత పార్టీని రిజిస్టర్ చేయొద్దని ఈసీకి విజ్ఞప్తి చేశారు.