
రక్షణ రంగంపై భారత్ భారీ ఖర్చు.. ప్రపంచంలో 5వ స్థానం
2025లో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచిందని స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం నివేదిక వెల్లడించింది. గత ఏడాది భారత్ రక్షణ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది, ఇది 2024 కంటే 8.9% ఎక్కువ. అమెరికా, చైనా, రష్యా, జర్మనీ దేశాలు భారత్ కంటే ముందున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం 2.9% పెరిగి 2,887 బిలియన్ డాలర్లుగా నమోదైంది.




