దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జగపతిబాబు హోస్ట్ చేసిన జయమ్ము నిశ్చయమ్మురా టాక్‌షోలో రాంగోపాల్ వర్మతో కలిసి పాల్గొన్న వంగా, బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ చూసిన తర్వాత అర్జున్ రెడ్డి ఇంటర్వెల్‌పై ఒక క్షణం భయపడ్డానని చెప్పుకొచ్చాడు. అయితే టీజర్, ట్రైలర్‌కు వచ్చిన స్పందన తనకు ధైర్యం ఇచ్చిందని, రాజమౌళి చూపిన స్థాయి ఇంటర్వెల్ సీన్ ప్రాముఖ్యతను నిరూపించిందని అభిప్రాయపడ్డాడు.