పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్ష కొనసాగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 20 వరకు తాను సజీవంగా ఉంటానని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఆత్మగా అయినా తిరిగి వస్తానని అన్నారు. బయటకు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, అంతర్గతంగా ఎంతో దృఢంగా ఉన్నానని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. కాగా, జులై 20న కాంక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.