TG: మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి అవుతానని, ఆ సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమని, వైఎస్ఆర్ ఆశయాల కోసం పాటుపడతానని, వైఎస్ఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కొత్తవారు పార్టీని కబ్జా చేయాలని చూస్తే ఊరుకోనని, నిజమైన
కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగదని, మళ్లీ
కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్ఆర్ రాజ్యాన్ని స్థాపిస్తానని ఆయన పేర్కొన్నారు.