BRS ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. తాను వెల్లడించిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.
కేసీఆర్,
కేటీఆర్, హరీశ్‌రావులకు వాట్సాప్, ఈమెయిల్, స్పీడ్‌పోస్ట్ ద్వారా లేఖలు పంపుతున్నానని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌క్లబ్‌కు వస్తానని, బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. "పాలమూరు పౌరుషం ఏంటో చూపిస్తా" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.