
కేకేఆర్ బ్యాటర్ రఘువంశీకి జరిమానా
కోల్కతా బ్యాటర్ రఘువంశీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్'గా ఔట్ అయినప్పుడు అంపైర్లతో వాగ్వాదానికి దిగి, ఆగ్రహంతో హెల్మెట్, బ్యాట్ విసిరికొట్టినందుకు ఈ చర్య తీసుకున్నారు. అతడికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు.




