తెలంగాణలోని సూర్యాపేట పట్టణంలో ఆదివారం అఘోరీ హల్‌చల్ చేశారు. అఘోరి అక్కడికి రావడాన్ని గమనించిన ప్రజలు ఒక్కసారిగా గుమిగూడారు. ఓ వ్యక్తి అఘోరిని సెల్ఫీ అడగగా.. సెల్ఫీ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో అఘోరిపై సదరు వ్యక్తి దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే తనపై దాడికి పాల్పడిన వ్యక్తి క్షమాపణ చెప్పేంత వరకు అతన్ని వదిలిపెట్టనంటూ అఘోరి ఘాటు వ్యాఖ్యలు చేసింది. నా దగ్గరకు రాకండి, నా ప్రైవసీకి వదిలిపెట్టండి అంటూ వ్యాఖ్యానించింది.