TG: రాష్ట్రంలో అప్పులపై సవాళ్ల రాజకీయం కొనసాగుతోంది. ఓ వైపు హరీశ్ రావు మరోవైపు మత్రి జూపల్లి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మంత్రి జూపల్లి ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని మరో సవాల్ విసిరారు. 'అప్పులపై నా మాటలకు కట్టుబడి ఉన్నా. నా లెక్క తప్పైతే రాజీనామా చేస్తా. రుజువు చేయకపోతే బీఆర్‌ఎస్ నేతలు ఏం చేస్తారు?. కేసీఆర్, కేటీఆర్‌కు నాలుగు పేజీల లేఖ రాశా. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుల కోసం 3 కుర్చీలు వేశాం' అని అన్నారు.