'నేను కూలి పని చేసి నా చెల్లిని చదివిస్తా'

3చూసినవారు
'నేను కూలి పని చేసి నా చెల్లిని చదివిస్తా'
TG: మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా హాజీపూర్ కు చెందిన దంపతులు లక్ష్మి- బందెప్ప బస్సు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలు విలపిస్తున్న తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది. 'అమ్మకు జెరం వచ్చింది. మా అమ్మను దవఖానాలో చూపిస్తా అని నాన్న పోయిండు. పొద్దుగూకినంక ఒస్తరసుకుంటే.. పొద్దుగాళ్ల మీ అమ్మనాయిన చచ్చిపోయిండ్రని ఫోనొచ్చింది' అంటూ బోరున విలపించారు. ఎంత కష్టమైనా సరే తాను కూలికి పోయి తన చెల్లిని చదివిస్తా అని పెద్దకూతురు శిరీష చెప్పింది.

సంబంధిత పోస్ట్