అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికరు నకముర, చెక్‌మేట్ చెస్ ఈవెంట్‌లో భారత స్టార్ గుకేశ్‌తో పోరు సందర్భంగా దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. గుకేశ్‌పై గెలిచిన తర్వాత, నకముర గుకేశ్ పావు (రాజు)ను తీసి ప్రేక్షకుల్లోకి విసిరి సంబరాలు చేసుకున్నాడు. 'గుకేశ్‌పై నేను గెలిచా. అభిమానులకు అది తెలియాలనే అలా చేశా. వారి నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలను వినాలని అనుకున్నా' అని నకముర పేర్కొన్నాడు. నకముర దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ నార్వే చెస్ టోర్నీలో మాగ్నస్ కార్ల్‌సన్ కూడా గుకేశ్ చేతిలో ఓటమి తర్వాత అసహనాన్ని వ్యక్తం చేశాడు.