విజయేందర్ దర్శకత్వంలో రూపొందిన 'మిత్రమండలి' సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన బన్నీ వాసు, సినిమా ట్రైలర్ పై వచ్చిన విమర్శలపై స్పందించారు. కొందరు తనను కించపరిచేలా మాట్లాడితే, వారికి తగిన విధంగా బదులిస్తానని, వెనుక నుంచి కాకుండా ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తే ధైర్యంగా ఎదుర్కొంటానని, కానీ వెనుక నుంచి పిచ్చిపిచ్చిగా చేస్తే ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఇవ్వాలో అది ఇచ్చేస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు.