
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 30, 2025వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీ వంటి విద్యార్హతలు, సంబంధిత పని అనుభవం అవసరం. వయోపరిమితి 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. జీతం నెలకు రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు ఉంటుంది.




