భారతీయ వైమానిక దళానికి చెందిన నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు ఆస్ట్రేలియాలోని డార్విన్‌లోని రాయల్
ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకున్నాయి. ఇవి 'పిచ్ బ్లాక్' పేరుతో జరిగే సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాల్లో సుమారు 19 దేశాలకు చెందిన 100 యుద్ధ విమానాలు, 2500 మంది సిబ్బంది పాల్గొంటారు. జులై 20 నుంచి ఆగస్టు 7 వరకు జరిగే ఈ విన్యాసాల్లో రఫేల్ విమానాలు తమ సామర్థ్యాలను ప్రదర్శించనున్నాయి. వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు వైమానిక యుద్ధ క్షేత్రాల్లో సామర్థ్యాలను పరీక్షించుకోవడం దీని లక్ష్యం.