iBomma రవి కేసులో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వివరాలు వెల్లడించారు. రవి OTTలో రిలీజ్ అయ్యే సినిమాలను అధునాతన టెక్నాలజీతో స్క్రీన్ రికార్డ్ చేసి, మంచి క్వాలిటీతో వెబ్‌సైట్లలో అప్లోడ్ చేసేవాడని చెప్పారు. అలాగే హై-ఎండ్ సీక్రెట్ కెమెరాలతో థియేటర్లలో కొత్త సినిమాలను రికార్డ్ చేసేవాడని వెల్లడించారు. మొత్తం పైరసీ రాకెట్ టెలిగ్రామ్ ద్వారా నడిచిందని, ఇదే నెట్‌వర్క్‌తో రవి కార్యకలాపాలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.