
20 ఏళ్ల తర్వాత బద్దలైన.. భారత్‌లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం
అండమాన్‌లోని బరాటాంగ్ జార్వా క్రీక్‌లో 20 ఏళ్ల తర్వాత మట్టి అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. అక్టోబర్ 2 మధ్యాహ్నం 1.30 గంటలకు భారీ శబ్దంతో బురద, వాయువులు ఎగసిపడ్డాయి. 3- 4 మీటర్ల మట్టి దిబ్బ ఏర్పడగా, వెయ్యి చదరపు మీటర్లకు పైగా వ్యాపించింది. చివరగా ఇది 2005లో బద్దలైంది. అధికారులు రాకపోకలు నిలిపి, స్థానికులు, పర్యాటకులకు అలర్ట్ జారీ చేశారు.




