CISCE, ISC బోర్డు పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ICSE 10వ తరగతి పరీక్షలు 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 30 వరకు, ISC 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు జరుగనున్నాయి. ఈసారి పరీక్షలు గత ఏడాదికంటే ముందుగా ప్రారంభం అవుతున్నాయి. ICSEలో 75 సబ్జెక్టులు, ISCలో 50 సబ్జెక్టులు ఉండగా, వరుసగా 2.6 లక్షల, 1.5 లక్షల విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థుల ప్రిపరేషన్‌కి సమయం ఇస్తూ షెడ్యూల్ రూపొందించినట్లు CISCE తెలిపింది.