
కలలో శివుడు కనిపించాడని తవ్వితే.. రెండు శివలింగాలు ప్రత్యక్షం!
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా మీర్జాపూర్ మొహ్సాన్‌పూర్ గ్రామంలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలుడు అఖిలేష్‌కు శుక్రవారం, సోమవారం రాత్రి కలలో పరమశివుడు కనిపించి, తన పొలంలో రెండు శివలింగాలు ఉన్నాయని చెప్పాడని తెలిపాడు. మరుసటి రోజు ఉదయం తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ప్రదేశంలో తవ్వగా, నిజంగానే రెండు శివలింగాలు బయటపడ్డాయి. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో, శివలింగాలు బయటపడ్డ స్థలంలో జనసమూహం పెరిగిపోయింది. ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు ప్రారంభించారు. ప్రజలు దీనిని దేవుని మహిమగా భావిస్తున్నారు.




