
ప్రముఖ సీరియల్ నటి సుభాషిణి ఆత్మహత్య
శ్రీలంకకు చెందిన ప్రముఖ సీరియల్ నటి సుభాషిణి తమిళనాడులో ఆత్మహత్య చేసుకున్నారు. పోరూరులోని అద్దె నివాసంలో ఆదివారం రాత్రి ఆమె ఉరేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు భర్తతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆ సమయంలో భర్తతో గొడవపడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. షూటింగ్ కోసం చెన్నై నుంచి సుభాషిణి పోరూర్కి వచ్చినట్లు తెలిసింది. టీవీ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




