
నేటి నుంచి తిరుపతి-విజయవాడ కొత్త విమాన సర్వీసు
నేటి నుంచి తిరుపతి - విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఫ్లై-91 విమానయాన సంస్థ ఈ సేవలను అందిస్తోంది. ఉదయం 8.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 9.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 10.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. వారంలో నాలుగు రోజులు నడిచే ఈ విమాన టికెట్ ధర రూ.3,000 నుంచి రూ.3,500 మధ్య ఉంది.




