తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నేడు సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ విచారణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు తీస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే జడ్చర్ల నియోజకవర్గంలో BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఏదైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, రాష్ట్రాన్ని తగులబెట్టేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు.